స్వచ్ఛ ఓటరు జాబితాకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ ఓటరు జాబితాకు సహకరించండి

Mar 22 2025 1:36 AM | Updated on Mar 22 2025 1:30 AM

ప్రశాంతి నిలయం: స్వచ్ఛ ఓటరు జాబితా తయారీకి సహకరించాలని రాజకీయ పార్టీల నాయకులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ కోరారు. ఓటర జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే తెలపాలన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో ఎన్నికల అధికారులతో కలిసి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు నుంచి అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 14,12,177 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 7,01,586 మంది, సీ్త్రలు 7,10,527 మంది, ఇతరులు 64 మంది ఉన్నారని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 1,576 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణ, తప్పుల్లేని ఓటరు జాబితా తయారీ, పోలింగ్‌ శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు, యువతను ఓటరుగా నమోదు చేసే అంశాలపై సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్‌ కోరారు. అలాగే రాజకీయ పార్టీలన్నీ బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి అన్ని నియోజకవర్గాల బూత్‌ స్థాయి అధికారులను నియమించి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయసారథి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ జాకీర్‌ హుస్సేన్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రాథమిక అంశాలపై నివేదికలు ఇవ్వండి

త్వరలోనే కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్య అంశాలపై నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో అన్ని ప్రభుత్వ విభాగాల జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రాబోయే మూడు నెలల్లో పంచాయతీ, మున్సిపల్‌, ఇరిగేషన్‌, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా విభాగం, మత్స్య, గృహ, విద్య, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, డీఆర్‌డీఏ, లీడ్‌ బ్యాంక్‌, వ్యవసాయం, అనుబంధ రంగాలు, సంక్షేమ శాఖలు, సేవా రంగాల శాఖలు తదితర శాఖల పరిధిలో నిర్వహించాల్సిన ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో

కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

ఫారంపాండ్ల పనులు గ్రౌండింగ్‌ చేయాలి

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో 3 నుంచి 5 ఫారంపాండ్ల పనుల కోసం గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ జల దినోత్సవం, పల్లె పండుగ కార్యక్రమంపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 7,760 ఫారంపాండ్లు నిర్మించాలని లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. అందులో ఇప్పటిదాకా 1,784 ఫారంపాండ్లు మంజూరు కాగా, 840 పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరు నాటికి పశువుల షెడ్లు లక్ష్యాలను సాధించాలని డ్వామా పీడీని ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్‌, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement