లైనింగ్‌ పనులు ఆపకపోతే ఉద్యమాలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

లైనింగ్‌ పనులు ఆపకపోతే ఉద్యమాలు తప్పవు

Mar 16 2025 12:58 AM | Updated on Mar 16 2025 12:58 AM

లైనిం

లైనింగ్‌ పనులు ఆపకపోతే ఉద్యమాలు తప్పవు

సోమందేపల్లి: హంద్రీ–నీవా పనులు రద్దు చేసి కాలువ వెడల్పు చేయకపోతే ఉద్యమాలు తప్పవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ తెలిపారు. శనివారం ఆయన సోమందేపల్లిలోని సీపీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొంతమంది స్వార్ధం కోసం లైనింగ్‌ పనులపై ప్రభుత్వం మక్కువ చూపుతూ రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తోందన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వస్తున్న 40 టీఎంసీల కన్నా అదనంగా నీరు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ ద్వారా చెరువులకు సాగునీటిని విడుదల చేయాలన్నారు. లైనింగ్‌ వల్ల జిల్లాలోని ఏడు నియోజకవర్గాల రైతులు త్రీవంగా నష్టపోతారని, ప్రభుత్వ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటేష్‌ రాజ్‌గోపాల్‌, రంగప్ప, హనుమయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బీటెక్‌ విద్యార్థి అదృశ్యం

నల్లమాడ: ఎద్దులవాండ్లపల్లికి చెందిన లక్ష్మీకాంత్‌రెడ్డి అనే బీటెక్‌ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. రామ్మోహన్‌రెడ్డికి ఇద్దరు సంతానం. వీరు కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు వలస వెళ్లి స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు లక్ష్మీకాంత్‌రెడ్డి అనంతపురంలోని ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల ఏడో తేదీన లక్ష్మీకాంత్‌రెడ్డి బెంగళూరుకు వస్తున్నానని తండ్రికి ఫోన్‌లె చెప్పి స్వగ్రామం ఎద్దులవాండ్లపల్లి నుంచి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. కొంతసేపటి తర్వాత తండ్రి ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ అని వచ్చింది. అనుమానం వచ్చి అనంతపురం, బెంగళూరు ప్రాంతాల్లో గాలించినా కుమారుడి ఆచూకీ కన్పించలేదు. దీంతో రామ్మోహన్‌రెడ్డి శనివారం నల్లమాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు.

త్వరలో హెచ్చెల్సీలో అత్యవసర పనులు

హెచ్చెల్సీ కాలువను పరిశీలించిన ఎస్‌ఈ రాజశేఖర్‌

బొమ్మనహాళ్‌: తుంగభద్ర ఎగువ కాలవ (హెచ్చెల్సీ)కి త్వరలోనే అత్యవసర పనులు ప్రారంభిస్తున్నట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ తెలిపారు. శనివారం ఆయన మండల పరిధిలో హెచ్చెల్సీ కాలువను పరిశీలించారు. బొమ్మనహాళ్‌, కృష్ణాపురం, ఉంతకల్లు, మైలాపురం, ఉద్దేహాళ్‌ గ్రామాల సమీపంలోని 126,105,109వ కిలోమీటర్ల వద్ద కాలువ వంతెనలను పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డంగా లేకుండా కాలువలో ఉన్న వ్యర్థాలను తొలగించాలని స్థానిక అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. అనంతరం విలేకరులతో ఎస్‌ఈ మాట్లాడుతూ హెచ్చెల్సీ అత్యవసర పనుల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. 165 కిలోమీటర్‌ నుంచి 189 కిలోమీటర్‌ వరకు రూ.34.95 కోట్లతో పనులు జరుగుతాయని తెలిపారు. జూలై నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బొమ్మనహాళ్‌ మండలంలో రూ.16 కోట్లతో వంతెన, లైనింగ్‌ పనులు జరుగుతాయని తెలిపారు. ఎప్పటికప్పుడు పనులు పరిశీలిస్తూ నాణ్యతగా ఉండేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేఈఈ అల్తాఫ్‌, హెచ్చెల్సీ సిబ్బంది పాల్గొన్నారు.

లైనింగ్‌ పనులు ఆపకపోతే ఉద్యమాలు తప్పవు1
1/1

లైనింగ్‌ పనులు ఆపకపోతే ఉద్యమాలు తప్పవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement