బుల్లెట్‌ షెల్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ షెల్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన

Mar 12 2025 7:27 AM | Updated on Mar 12 2025 7:24 AM

చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దెల సమీపంలో నిర్మాణంలో ఉన్న బుల్లెట్‌ షెల్‌ (తుపాకులలో ఉపయోగించే) ఫ్యాక్టరీని జిల్లా ఎస్పీ రత్న మంగళవారం పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారంటూ యాజమాన్య ప్రతినిధులతో ఆరా తీశారు. కంపెనీ వివరాలు, చేపట్టిన పనులు ఎంత వరకూ పూర్తి అయింది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌, రామగిరి సీఐ శ్రీధర్‌, చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ, కంపెనీ సిబ్బంది ఉన్నారు.

నేరాల నియంత్రణకు చొరవ తీసుకోండి

పెనుకొండ రూరల్‌: అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ రత్న ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కియా పీఎస్‌ను ఆమె తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామ ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్‌, ఎస్‌ఐ రాజేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ఎస్పీ

చెన్నేకొత్తపల్లి: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పీ రత్న అన్నారు. సీకేపల్లిలోని టింబక్టు కలెక్టివ్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరయ్యారు. అంతకు ముందు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్పీతో పాటు టింబక్టు కలెక్టివ్‌ సంస్థ వ్యవస్థాపకురాలు మేరి మాట్లాడారు. మహిళల రక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ హేమంతకుమార్‌, సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ సత్యనారాయణ, సంస్థ ఏడీ సుకన్య, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

బుల్లెట్‌ షెల్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన 1
1/1

బుల్లెట్‌ షెల్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement