బాబు ‘ష్యూరిటీ’.. ‘మోసం’ గ్యారంటీ | - | Sakshi
Sakshi News home page

బాబు ‘ష్యూరిటీ’.. ‘మోసం’ గ్యారంటీ

Mar 8 2025 2:06 AM | Updated on Mar 8 2025 2:03 AM

కదిరి: పింఛన్లు మినహా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను సీఎం చంద్రబాబు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం మోసగించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు తాను ష్యూరిటీ అంటూ ప్రజలను నమ్మించిన చంద్రబాబు... అధికారం చేపట్టిన తర్వాత మోసం గ్యారంటీ అనేది మరోసారి రుజువు చేశారన్నారు. శుక్రవారం తన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివద్ది, సంక్షేమం పూర్తిగా పక్కనబెట్టి కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని మండిపడ్డారు. రైతులకు ఏటా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఆ ఇస్తామని చెప్పిన చంద్రబాబు నేడు తల్లులను మోసగించారన్నారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసంపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. ఇప్పటికై నా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడక పోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

పూల శ్రీనివాసరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement