సాక్షి, పుట్టపర్తి: ప్రభుత్వ వైద్యసేవలపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పేదలకు మంచి చేసే కార్యక్రమాలకు గండి కొడుతోంది. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కూడా సక్రమంగా లేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వైద్య సిబ్బంది లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ–ఐ కేర్ కేంద్రాలు ఎత్తేయడంతో పేదలు వైద్యసేవలకు దూరమయ్యారు.
‘ఈ–ఐ కేర్’ సేవలకు మంగళం..
జిల్లాలోని పెనుకొండ, ధర్మవరం, మడకశిర, చెన్నేకొత్తపల్లి, నల్లమాడలో కంటి పరీక్ష కేంద్రాలు ఉండేవి. 2018లో ఎన్నికల ముందు ప్రారంభించిన చంద్రబాబు.. మళ్లీ ఆయనే అధికారం చేపట్టిన తర్వాత వ్యవస్థను రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 115 కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో సుమారు 200 మంది ఉపాధి కోల్పోయారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో రోజుకు సగటున 200 మందికి కంటి పరీక్షలు చేసేవారు.
ఉద్యోగుల రోడ్డు పాలు..
రాష్ట్ర వ్యాప్తంగా 115 కేంద్రాల్లో జనాభా ఆధారంగా ఒక్కో ఈ–ఐ కేర్ కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు చొప్పున పని చేసేవారు. ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.18 వేలు చొప్పున వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు మూతపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది ఉపాధి కోల్పోయారు. అదేవిధంగా లక్షల మంది ఉచిత కంటి పరీక్షలు దూరమయ్యారు. అదేవిధంగా ఎంపీహెచ్‌ఏలను ఉన్నఫలంగా తొలగించడంతో చాలా మంది కుటుంబ భారం మోయలేక ... ఉద్యోగం కోసం విజయవాడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన 58 మంది ఉన్నారు.
పట్టించుకోని ఆరోగ్యశాఖామంత్రి..
ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేస్తామని ౖపైపెకి చెబుతున్నా కూటమి సర్కార్ చర్యలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. ఎంపీహెచ్‌ఏల తొలగింపు, ఆరోగ్యశ్రీపై సేవలు ఎత్తివేత దిశగా చర్యలు, ఈ–ఐ కేంద్రాల మూత నిర్ణయాలు దానికి బలాన్నిస్తున్నాయి. అయితే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే వైద్యశాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకపోయిందని , తామంతా రోడ్డున పడ్డామని ఎంపీహెచ్‌ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ మండలిలో డిమాండ్ చేసినా కూటమి ప్రభుత్వం మాత్రం నోరు విప్పలేదు.
రద్దు చేయడం బాధాకరం
ఐదేళ్ల పాటు ఉచిత సేవలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు రద్దు చేయడం బాధాకరం. పరీక్షలు చేయించుకోవడానికి వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను అందజేశారు.
– వెంకటేష్, మడకశిర
లక్షల మంది పేదలకు ఉపయోగపడే కంటి పరీక్ష కేంద్రాలను రద్దు చేయడం దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ఉపాధి కోల్పోవడంతో పాటు రోజూ సగటున సుమారు 50 వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించేవారు. అంతమంది పేదలు ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టాల్సిన దుస్థితి. చంద్రబాబు తీరు మార్చుకోవాలి. – గోపాల్, పెనుకొండ
ఇప్పటికే ముఖ్యమంత్రి ఐ కేర్ ఎత్తివేత
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు
‘ఆరోగ్యశ్రీ’ పథకం అమలు
అంతంత మాత్రమే
ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు
కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. పే
కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. పే
కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. పే
కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. పే