ముగ్ధ శారీస్‌ ఎండీపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ముగ్ధ శారీస్‌ ఎండీపై కేసు నమోదు

Mar 7 2025 12:43 AM | Updated on Mar 7 2025 12:43 AM

ధర్మవరం అర్బన్‌: స్థానిక పట్టుచీరల వ్యాపారస్తుల వద్ద పట్టుచీరలు, పట్టు పావడాలు కొనుగోలు చేసి, ఇందుకు సంబంధించిర రూ.3.53 కోట్లను ఇవ్వకుండా మోసం చేసిన మహిళపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ధర్మవరం వన్‌టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు ఆయన వివరాలను వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ముగ్ధ పేరుతో రిటైల్‌ దుకాణాలు నిర్వహిస్తున్న వంగపల్లి శశి... ధర్మవరం పట్టణానికి చెందిన దాసరి నాగభూషణంతో రూ.1.73కోట్ల విలువ చేసే పట్టు పావడాలు, లక్ష్మి హన్షిక శిల్క్‌ శారీస్‌ యజమాని ముక్తాపురం బాలకృష్ణ వద్ద రూ.1.80కోట్లు విలువ చేసే పట్టుచీరలను కొనుగోలు చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన బాధితులు గురువారం రాత్రి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం ముగ్ధ శారీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంగపల్లి శశిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

యువకుడి బలవన్మరణం

ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన ఎగ్గిడి లోకేష్‌ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. గేదెల పోషణతో జీవనం సాగించే లోకేష్‌ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కడుపు నొప్పి తీవ్రత తాళలేక స్థానిక బైపాస్‌ సమీపంలోని ఓ రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement