
గాండ్లపెంట మండలానికి కృష్ణా జలాల అంశాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగానే ‘తప్పకుండా ఇద్దాం’అన్నారు. ఇప్పుడు నిధులు కూడా మంజూరు చేశారు. మాది చేతల ప్రభుత్వం. హంద్రీనీవా జలాలతో ఇప్పటికే నియోజకవర్గంలోని ఎన్నో చెరువులను నింపాం. వీటి ద్వారా భూగర్భజలాలు ౖపైపెకి వచ్చాయి. భవిష్యత్‌లో కదిరి నియోజకవర్గం తప్పకుండా సస్యశ్యామలమవుతుంది.
– డా.పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి
మాటకు కట్టుబడ్డారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. ఇద్దరూ ఇద్దరే. గాండ్లపెంట మండలానికి కృష్ణా జలాలు వస్తున్నాయంటే చాలా సంతోషంగా ఉంది. జగన్ ప్రభుత్వానికి కదిరి ప్రాంత రైతులందరూ కృతజ్ఞతగా ఉంటారు.
– పోతినేని వెంకట చలపతి, రైతు, కోటూరు
ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం
డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీఆర్‌సీ) ప్రభుత్వానికి పంపగానే నిధులు మంజూరు చేశారు. త్వరలోనే మొత్తం ప్రణాళిక సిద్ధం చేసి టెండర్లు పిలుస్తాం. ఎత్తిపోతల పథకం ద్వారా కదిరి, గాండ్లపెంట మండలాల పరిధిలోని 22 చెరువులకు కృష్ణా జలాలు అందుతాయి. సీజీ ప్రాజెక్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– సి.అరుణ, ఇరిగేషన్ ఏఈ, కదిరి

