
ఉరవకొండ: ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సోమవారం హుండీ కానుకలను లెక్కించారు. ఆలయ ఈఓ విజయ్‌కుమార్, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్‌స్పెక్టర్ కె.రాణి పర్యవేక్షించారు. ఆలయంలోని ఆరు హుండీలను లెక్కించగా 119 రోజులకు గాను రూ.30,14,991 ఆదాయం చేకూరింది.
పండమేరులో పడి
యువతి మృతి
రాప్తాడు: ప్రమాదవశాత్తు పండమేరులో పడి ఓ యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడుకు చెందిన చిన్న ఓబన్న కుమార్తె సాకే చంద్రకళ (33) తల్లిదండ్రులు మృతిచెందడంతో సోదరులు గౌరిశంకర్, శ్రీనివాసులు వద్ద ఉంటోంది. కంటి చూపు సరిగా లేని ఆమె సోమవారం ఉదయం జేఎన్‌టీయూ మార్గంలోని పండమేరు వంకలోకి బహిర్భూమి కోసం వెళ్లింది. ఆ సమయంలో అదుపు తప్పి వంకలో పడడంతో నీట మునిగి ఊపిరి ఆడక మృతి చెందింది. 11 గంటల ప్రాంతంలో అటుగా వెళ్లిన వారు గుర్తించి, సమాచారం అందించడంతో ఎస్‌ఐ ఆంజనేయులు అక్కడకెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతురాలిని చంద్రకళగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారొచ్చి ధ్రువీకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

హుండీ కానుకలను లెక్కిస్తున్న దృశ్యం