
అవార్డుకు ఎంపికై న ఫొటో
అనంతపురం కల్చరల్: సాక్షి దినపత్రిక ఫొటోగ్రాఫర్ డి.మహబూబ్‌బాషాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు దక్కింది. ఈ మేరకు ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ) ఫౌండర్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ సౌజన్యంతో పీఏఐ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు సూర్యోదయం సమయంలో భానుడి లేలేత కిరణాలు తాకి శోభాయమానంగా వెలుగులీనుతున్న ఇస్కాన్ మందిరాన్ని తన కెమెరాలో మహబూబ్‌బాషా బంధించిన తీరు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టింది. ఈ చిత్రమే ఆయనను పోటీల్లో విజేతగా నిలబెట్టింది. ఈ నెల 27న విజయవాడ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పర్యాటక దినోత్సవంలో మంత్రులు, అధికారుల చేతుల మీదుగా ఆయన అవార్డుతో పాటు బంగారు పతకాన్ని అందుకోనున్నారు. ఉత్తమ ఫొటో జర్నలిస్టుగా ఎంపికై న మహబూబ్ బాషాను జిల్లా ఫొటో జర్నలిస్టు యూనియన్ నాయకులు అభినందించారు.

డి.మహబూబ్‌బాషా