కుట్రలను తిప్పి కొట్టండి | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 10:06 AM | Updated on Feb 26 2023 5:58 AM

గోరంట్ల/ పెనుకొండ/ సోమందేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబును అధికారంలోకి తేవడానికి రామోజీరావు శ్రీఈనాడుశ్రీలో తప్పుడు కథనాలు వండివార్చి ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటున్న కుట్రలను తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు. తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు ప్రతులను శంకరనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం గోరంట్లలోని బస్టాండ్‌ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దహనం చేశారు.

శంకరనారాయణ మాట్లాడుతూ జనరంజక పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు రామోజీరావు పత్రికా విలువలను దిగజారుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో గోరంట్ల మార్కెట్‌యార్డు ఉపాధ్యక్షుడు నూర్‌మహమ్మద్‌, వైఎస్సార్‌సీపీ రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు పాటూరి శంకరరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఫకృద్దీన్‌ సాహెబ్‌, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు డాక్టర్‌ బాషా, నాయకులు మేదరశంకర, శంకరరెడడ్డి, ప్రభాకారరావు, సర్పంంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా పెనుకొండలో నగరపంచాయతీ చైర్మన్‌ ఉమర్‌ఫారూక్‌ఖాన్‌, వైస్‌ చైర్మన్‌ సునీల్‌, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ బోయ నరసింహ నేతృత్వంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. సోమందేపల్లిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లోనూ వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్‌ వెంకటరత్నం, ఉప సర్పంచ్‌ వేణు, వైస్‌ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ ఇమామ్‌వలి, సీనియర్‌ నాయకులు యల్లారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు ఈనాడు ప్రతులను తగులబెట్టి.. తప్పుడు రాతలను ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement