మా ఊరునే బ్యాంక్‌లో తాకట్టు పెట్టారు | - | Sakshi
Sakshi News home page

మా ఊరునే బ్యాంక్‌లో తాకట్టు పెట్టారు

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

మా ఊరు ఉన్న సర్వే నంబర్‌ పేరుతో కొందరు వ్యక్తులు వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక అవసరాలకు ఇల్లు రిజిస్ట్రేషన్‌ కాక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా అధికారులు మా గ్రామానికి జరిగిన అన్యాయంపై స్పందించాలి. ఎవరెవరో రుణాలు తీసుకుంటే.. దానికి మేము బాధ్యత వహించాలా?.

– సాన మహేంద్ర, తిమ్మారెడ్డిపాళెం

మాది ఊరు కాదంట.. పొలాలంట

మేము 50 ఏళ్లుగా ఈ గ్రామంలోనే నివాసం ఉంటున్నాం. మా ఊరును వ్యవసాయ పొలాలుగా నమోదు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో మా ఊరే లేకుండా చేశారు. మేము నివసిస్తున్న ఇల్లు స్థలం కూడా వ్యవసాయ భూమిగా ఇతరుల పేరుతో ఉంది. మాకు రిజిస్ట్రేషన్‌ కాదంటున్నారు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి రెవెన్యూ రికార్డుల్లో తమ గ్రామాన్ని నమోదు చేయాలని కోరుతున్నాను.

– వనిపెంట కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డిపాళెం

Advertisement
 
Advertisement
Advertisement