రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా అక్రమ లేఅవుట్ అని తెలిసి కూడా అమాయక ప్రజలను అమ్మించి తాను లబ్ధిపొందాడు. అయితే ఇప్పుడు ఆ అక్రమ లేఅవుట్లపైనా విచారణ జరుగుతుండడంతో కొనుగోలుదారులు రామకృష్ణపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఆయనకు తెలిసే మాకు కట్టబెట్టారని తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ పెరగడంతో అక్రమ వెంచర్ల ప్లాట్లకు సంబంధించి సమస్య ఏర్పడుతుందని భావించిన ఆయన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని విచారణాధికారులపై రౌడీయిజం ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రియల్ వెంచర్ల అక్రమాలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ సీఐ నరసింహరావు తన సిబ్బందితో వచ్చారని తెలుసుకున్న సదరు రామకృష్ణ మరో మీడియేటర్ కనక కిరీటితో కలిసి సీఐపై దురుసుగా ప్రవర్తించాడు‘వెంచర్లపైనా, రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టేందుకు నీకేం అధికారం ఉందో జీఓ చూపించమంటూ దౌర్జన్యం చేశాడు. నేనెవరో తెలుసా.. నా వెనుక ఎవరున్నారో తెలుసా.. నీకెంత ధైర్యం ఉంటే మాపైనే విచారణ చేస్తావా? నాకు అధికార పార్టీ అండదండలు నాకు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే మనిషిని, నన్ను ఎవరు ఏమి చేయలేరు. మీరు విచారణ చేయడానికి వీల్లేదంటూ ఏకంగా ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఒకానొక సమయంలో విజిలెన్స్ సిబంది రామకృష్ణ మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో విజిలెన్స్ సీఐ నరసింహరావు కావలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఖాసిం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


