ప్రతిష్టను భ్రష్టుపట్టిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రతిష్టను భ్రష్టుపట్టిస్తున్నారు

Apr 5 2026 7:36 AM | Updated on Apr 5 2026 7:36 AM

నెల్లూరు సిటీ: టీటీడీ ప్రతిష్టను భ్రష్టుపట్టించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి మండిపడ్డారు. నగరంలోని కరెంటాఫీస్‌ సెంటర్‌లో ధర్నాను శనివారం చేపట్టారు. దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం విజయకుమార్‌రెడ్డి మాట్లాడారు. అనైతిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులను థార్మిక సంస్థలకు దూరంగా ఉంచాలని డిమాండ్‌ చేశారు. తిరుమలలో భక్తులను ఇబ్బందులకు గురిచేయడం, దాడి చేయడం లాంటి చర్యలతో టీటీడీ అప్రతిష్టపాలవుతోందని చెప్పారు. సోషల్‌ మీడియాలో బీఆర్‌ నాయుడి వీడియోలు బయటకొచ్చినా, తప్పులు చేసిన వారిని సమర్థిస్తూ ప్రజలకు సీఎం చంద్రబాబు ఏమి సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. వయస్సులో పెద్ద.. ఓ చానల్‌ యజమానే ఈ విధమైన చర్యలకు పాల్పడితే.. తామేమీ తీసిపోమనే రీతిలో తెలుగు తమ్ముళ్లు అసభ్యకర చేష్టలతో రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి.. బీఆర్‌ నాయుడ్ని తొలగించి, సంస్కారవంతులను చైర్మన్‌ పదవిలో కూర్చోబెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేటర్‌ సత్తార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మహిళా జోనల్‌ అధ్యక్షురాలు మెయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద, అంగన్‌వాడీ విభాగాధ్యక్షురాలు లావణ్య, బీసీ సెల్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ శ్యామ్‌సింగ్‌, జిల్లా సెక్రటరీ ఆదిరెడ్డి, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు ఇక్బాల్‌, రూరల్‌ మహిళాధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement