ఉదయగిరి: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడ్ని తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. వింజమూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలను శనివారం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని విమర్శించారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని సైతం రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షాన నిలిచి.. కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను అందజేసిన అంశాన్ని ప్రస్తావించారు. అరాచక పాలన సాగిస్తున్న కూటమి నేతలకు సద్బుద్ధిని ప్రసాదించాలని వెంకటేశ్వరుడ్ని కోరారు. యువనేత మేకపాటి అభినవ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు గూడపు వీరశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కోనం సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీలు మాల్యాద్రి, గణపం బాలకృష్ణారెడ్డి, శివలీల, నేతలు పల్లాల కొండారెడ్డి, రేవునూరి శ్రీనివాసరెడ్డి, చింతంరెడ్డి సుబ్బారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


