అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. | - | Sakshi
Sakshi News home page

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

వ్యక్తి బలవన్మరణం

నెల్లూరు సిటీ: కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి మద్యంలో గడ్డిమందు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రూరల్‌ మండలంలోని దొంతాలి గ్రామంలో నర్రా వెంకటరాజు (55) నివాసముంటున్నాడు. వివాహమై ఇద్దరు కుమారులున్నారు. అతని భార్య మూడు సంవత్సరాల క్రితం కేన్సర్‌తో చనిపోయింది. వెంకటరాజు ఒంటరిగా ఉంటున్నాడు. అనారోగ్యంతో నిత్యం బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఇంట్లోనే మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగాడు. హైదరాబాద్‌ నుంచి గురువారం పెద్ద కుమా రుడు యశ్వంత్‌ వచ్చా డు. ఇంట్లోకి వెళ్లగా అపస్మారకస్థితి లో తండ్రి కనిపించాడు. వెంటనే 108 అంబులెన్స్‌కి ఫోన్‌ చేశాడు. సిబ్బంది హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంకటరాజు గతంలో కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement