ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

దుత్తలూరు: ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండలంలోని నందిపాడు ఎస్సీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నందిపాడు ఎస్సీ కాలనీకి చెందిన బక్కా ప్రసాద్‌ (32)కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అతను తన బావమరిది కొసినపోగు మధు పెళ్లికి వైఎస్సార్‌ కడప జిల్లా ఖాజీపేటకు ఆదివారం వెళ్లాడు. తిరిగి అర్ధరాత్రికి కాలనీకి చేరాడు. ముందుగా తన ఇంటికి వెళ్లాడు. భార్య అదే కాలనీలోని పుట్టింట్లో ఉండటంతో సోమవారం తెల్లవారుజామున అక్కడికెళ్లాడు. కాసేపటికి ఏమైందో గానీ తలుపులు వేసుకుని లోపల గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఇంటి వెంటిలేటర్‌ నుంచి చూశారు. వెంటనే తలుపులు పగులగొట్టి ప్రసాద్‌ను కిందికి దించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ కలహాలతోనే ప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement