సీ్త్రనిధిలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించినా.. డీఆర్డీఏ సిబ్బంది చేతివాటంతో పొదుపు మహిళలు లబోదిబోమంటున్నారు. అధికారులకు పలువురు వినతిపత్రమిచ్చారు. సంగం మండలం మర్రిపాడుకు చెందిన శ్రీవీరాంజనేయ, శ్రీహనుమాన్, శ్రీలక్ష్మి పొదుపు సంఘాలు సీ్త్రనిధి ద్వారా రూ.4 లక్షల చొప్పున రుణాలు పొందారు. శ్రీలక్ష్మి పొదుపు సంఘం వారు తమకు రూ.3 లక్షలు సరిపోతాయని, మిగిలిన రుణం తిరిగి చెల్లించి తీర్మానం కూడా చేసుకున్నారు. కానీ ఆ మొత్తాన్ని బకాయిగా చూపించడంతో వారు ఆవేదన చెందుతున్నారు. అలాగే శ్రీహనుమాన్ పొదుపు సంఘం వారు ప్రతినెలా నగదు చెల్లిస్తున్నా మరో మూడు నెలలు కట్టాలంటూ బకాయి చూపారు. మరో గ్రూపు పరిస్థితి ఇలాగే ఉంది. న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు.


