కలెక్టరేట్‌ ఎదుట బీటీఏ నిరసన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట బీటీఏ నిరసన

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

నెల్లూరు(దర్గామిట్ట): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీటీఏ జిల్లా శాఖ నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గలేదని వాపోయారు. జిల్లా అధ్యక్షుడు మణి సుబ్బు, ప్రధాన కార్యదర్శి మాస ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement