కడచూపూ కరువాయె బిడ్డా.. | - | Sakshi
Sakshi News home page

కడచూపూ కరువాయె బిడ్డా..

Mar 29 2026 7:24 AM | Updated on Mar 29 2026 7:24 AM

దుత్తలూరు: కడచూపునకూ నోచుకోలేదు బిడ్డా.. ఎలాంటి మృత్యువు సంభవించింది.. ఈ కష్టం పగవాడికీ రాకూడదు.. మేమెలా బతికేదంటూ బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో మందాలనాయుడుపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గుండ్లపల్లి వెంకటేష్‌ మాంసపు ముద్దను అంబులెన్స్‌ ద్వారా గ్రామానికి తీసుకొచ్చారు. ఆపై అంత్యక్రియలను పూర్తి చేశారు. తల్లిదండ్రులు, భార్యను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చిన్నపిల్లలను చూసిన ప్రతి ఒక్కరి మనస్సు చలించిపోయింది. తహసీల్దార్‌ యనమల నాగరాజు, ఎస్సై ఆదిలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జున నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement