నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి ద్రోహం చేసిందని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 14వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. కాకాణి మాట్లాడుతూ ఎన్నికల ముందు మెగా డీఎస్సీపై మొదటి సంతకం అని చెప్పిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం చేసిన చాలా నెలల తర్వాత దగా డీఎస్సీగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనన్నారు. చంద్రబాబు, లోకేశ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ సచివాలయ పరిధిలో ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో జాబితాను ధైర్యంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం, వాస్తవానికి పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను కారు చౌకగా తమ అనుయాయులు కట్టబెడుతూ దోపిడీకి ప్రయత్నిస్తుందన్నారు.
జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల సృష్టి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఊహించని విధంగా సచివాలయ వ్యవస్థను తెచ్చి 1.50 లక్షల ఉద్యోగోలు ప్రత్యక్షంగా కల్పించారని, పరోక్షంగా 2.50 లక్షల వలంటీర్లకు ఉద్యోగ ఉపాధి కల్పించారని కాకాణి గురు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కార్మికుల భద్రతకు, సంక్షేమానికి పెద్ద పీట వేశారని, కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే స్పందించి అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సమీక్షలు గానీ, కార్మికుల భద్రత పట్ల శ్రద్ధ గానీ లేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కార్మికుల భద్రత గాలిల్లో ఉందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గతంలో నినదించిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కార్మికులతో అగౌరవంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలోని యూనిట్లు ఒక్కొక్కటిగా మూత పడుతుంటే.. రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కూటమి నేతల దోపిడీని చూసి పారిపోతున్నాయన్నారు. కంపెనీల వారీగా ఎక్కడెక్కడ ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో జాబితా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్మికుల కోరికల సాధన కోసం, వారి కష్టాలు తీర్చడం కోసం ముందుంటామన్నారు.
నెల్లూరు సిటీ కార్యాలయంలో...
నగరంలోని రాంజీనగర్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ కాంగ్రెస్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌టీయూసీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కేక్ కటింగ్ నిర్వహించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో వైఎస్సార్‌టీయూసీ ముందుండాలని చంద్రశేఖర్ రెడ్డి సూ చించారు. వైఎస్సార్‌టీయూసీ కార్మికులకు అండగా పోరాటాలకు వేదిక కావాలని కోరారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లేవ్
పరిశ్రమల పేరుతో భూముల
దోపిడీ తప్ప
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఘనంగా వైఎస్సార్ టీయూసీ
ఆవిర్భావ దినోత్సవం


