● కావలి కొత్త సీఐగా శివశంకర్
కావలి: కావలి రూర ల్ సీఐ పాపారావును వీఆర్‌కు పంపిస్తూ శుక్రవారం అర్ధరాత్రి గుంటూర్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశా రు. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో తమిళ బోట్లు మాయమైన ఘటన నేపథ్యంలో ఆయన్ను వీఆర్‌కు పంపినట్లుగా సమాచారం. ఆయన స్థానంలో శివశంకర్‌ను నియమించారు. శనివారం బాధ్యతలు స్వీకరించిన శివశంకర్ నెల్లూరులో ఎస్పీ అజిత వేజెండ్లను మర్యాదపూర్వకంగా కలిశారు.
హార్బర్ భూములు ప్రైవేట్ సంస్థకు కేటాయించడం దారుణం
బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నెలోని ఫిషింగ్ హార్బర్ భూములను కొంత మేర సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థకు కేటాయించడం దారుణమని ఏపీ ఫిషర్‌మెన్ జేఏసీ ప్రతినిధులు ఖండించారు. జువ్వల దిన్నెలోని హార్బర్‌ను, సాగర్ డిఫెన్స్ సంస్థకు కేటాయించనున్న భూములను స్థానిక మత్స్యకారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హార్బర్ భూ ములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో సముద్ర తీరాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రతిపాదనలు విరమించుకొని, తక్షణమే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకారులకు అండగా నిలవాలని కోరారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల బోట్లు ఏపీ తీరంలో వేట సాగించకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల జువ్వలదిన్నెలో బోట్లు విడిపించుకు వెళ్లిన ఘటనలో బాధ్యులపైన కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణపై ఏపీ తీరంలోని మత్స్యకారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు.


