19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్
నెల్లూరు(దర్గామిట్ట): ఈ నెల 19న కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌డేను నిర్వహించనున్నట్లుగా డీఆర్వో విజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20న నిర్వహించాల్సిన గ్రీవెన్స్‌డేను ఒకరోజు ముందుగా జరుపు తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శైవక్షేత్రాలకు నిరంతర
విద్యుత్ సరఫరా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశాల మేరకు శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లుగా ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం తెలిపారు. నగరంలోని విద్యుత్‌భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలతో పాటు చిన్న శివాలయాలకు అంతరాయం లేకుండా సరఫరాను అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విద్యుత్ సమస్య తలెత్తితో వెంటనే సిబ్బందికి తెలియజేయాలని కోరారు.
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
నెల్లూరు (లీగల్): ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల కు సంబంధించి నెల్లూరులోని బార్ అసోసియేషన్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొత్తం 1,607 మంది ఓటర్లు ఉండగా, 1,380 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని సీసీ కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


