ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారంతో ముగిశాయి. ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్స్‌లో 493 మందికి గానూ 485 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలో 463 మందికి గానూ 21 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ వరప్రసాదరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, స్క్వాడ్ అధికారులు తనిఖీలను నిర్వహించారు.
గోవులకు తక్షణమే
టీఎమ్మార్‌ను అందించాలి
దుత్తలూరు: మండలంలోని నర్రవాడ వెంగమాంబ దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులు బక్క చిక్కి ఉన్నాయని, వీటికి వెంటనే టీఎమ్మార్ దాణామృతాన్ని అందజేయాలని నర్రవాడ ఇన్‌చార్జి పశు వైద్యాధికారి మధు పేర్కొన్నారు. ఆవుల దుస్థితిపై ‘అయ్యో గోమాత’ అనే శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైన తరుణంలో ఆలయ ఇన్‌చార్జి ఈఓ శ్రీనివాసరెడ్డితో కలిసి గోశాలను మంగళవారం పరిశీలించారు. గోవుల ఆరో గ్యం మెరుగుపడే అంశమై పలు సూచనలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్కో గోవుకు రోజూ ఐదు కిలోల చొప్పున దాణామృతాన్ని అందజేయాలని కోరారు. ఎలాంటి అనారోగ్యమొచ్చినా వెంటనే చికిత్స చేయనున్నామని వివరించారు.
ఆల్బెండాజోల్ మాత్రలను
తప్పక ఇవ్వాలి
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో 19 ఏళ్లలోపు వారికి నులిపురుగుల నివారణ మాత్రలను తప్పక అందించాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఈ నెల 17న పురస్కరించుకొని ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీపై కలెక్టరేట్లోని తన చాంబర్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో వీటిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వ ర్యంలో అందజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పా రు. ఈ నెల 17న వేసుకోలేకపోయిన వారికి 24న అందజేయనున్నామని పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ సుజాత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఉమామహేశ్వరి, ప్రోగ్రామ్ ఆఫీసర్ యశ్వంత్, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఆర్‌ఐఓ వరప్రసాదరావు, ప్రోగ్రామ్ మేనేజర్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 74,130 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,631 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్


