దారుణంగా రహదారులు
మర్లపూడి వద్ద ఇలా..
దెబ్బతిన్న రహదారి
సైదాపురం: మండలంలో పలు రహదారులు దారుణంగా మారాయి. ఆర్‌అండ్‌బీ అధికారులున్నారా.. లేదా అనేది ప్రశ్నగానే మిగిలింది. గుంతల్లో తట్ట మట్టి పోసేసి అధికారులు మొహం చాటేస్తుండటంతో ఆ రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. మండలంలోని మర్లపూడి – కోమటిగుంట రాజుపాళెం వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 5 కిలోమీటర్లు ఉన్న రహదారిపై ప్రయాణం గంటకు పైగా పడుతుంది. మర్లపూడి వద్ద రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనదారులు కష్టాలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు.
దారుణంగా రహదారులు


