ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
● డీఎంహెచ్‌ఓ సుజాత
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ సుజాత సూచించారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఆస్పత్రులు, ల్యాబ్‌లు నిర్వహిస్తున్న వారిపై అల్లోపతి మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ 2002 చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఐదు సంవత్సరాల గడువుతీరే వారు మూడు నెలలు ముందుగానే దరఖాస్తు చేసుకుని రెన్యువల్ చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తోపాటు అందిస్తున్న వైద్యసేవలకు సంబంధించిన ధరల పట్టికను బోర్డులో ప్రదర్శించాలన్నారు. అలాగే ప్రతి డాక్టర్, స్టాఫ్ నర్సులకు హెల్త్ ప్రొఫెషన్ ఐడీ (హెచ్‌పీఆర్), హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ (హెచ్‌ఎఫ్‌ఆర్) చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డెమో అధికారి కనకరత్నం, డీపీఓ రమేష్‌బాబు, ఏఎస్‌ఓ రమేష్, షైనీ, కల్యాణ్ పాల్గొన్నారు.


