బాలాజీ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌లో లక్కీ డ్రా
నెల్లూరు(బారకాసు): నెల్లూరులోని నర్తకీ సెంటర్‌లో ఉన్న బాలాజీ మొబైల్స్‌లో మంగళవారం సంక్రాంతి పండగ లక్కీ డ్రా తీశారు. మొదటి బహుమతిగా స్కూటర్‌ను నెల్లూరుకు చెందిన సత్యనారాయణ, మరో స్కూటర్‌ను ముత్తుకూరు మండలం నేలటూరుకు చెందిన నాగేశ్వరరావు గెలుచుకున్నారు. రెండో బహుమతిగా ఎయిర్ కండీషనర్, మూడో బహుమతిగా 43 అంగుళాల రెండు టీవీ, నాలుగో బహుమతిగా వాషింగ్ మెషీన్, ఐదో బహుమతిగా 32 అంగుళాల రెండు టీవీలు, ఆరో బహుమతిగా మూడు రైస్‌కుక్కర్లను విజేతలు గెలుచుకున్నారు. విజేతలకు సంస్థ డైరెక్టర్ రవి నాయుడు ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వినూత్న ఆఫర్లతో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలను బాలాజీ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అందిస్తోందని సంస్థ చైర్మన్ వైడీ బాలాజీ చౌదరి, సీఈఓలు సాయినిఖిలేష్, సాయినితీష్ తెలిపారు. రవి నాయుడు మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా తమ సంస్థ జిల్లా ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు.


