అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి.. | - | Sakshi
Sakshi News home page

అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..

Feb 10 2026 7:21 AM | Updated on Feb 10 2026 7:21 AM

అర్జీ

అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

పింఛన్‌ కోసం పలువురి వినతి

నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌ కుమార్‌, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కృష్ణకుమార్‌, డ్వామా పీడీ గంగా భవాని తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సదుపాయాలు కల్పించాలని అఖిలపక్ష రైతు సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం త్వరలో మార్కెట్‌లోకి రాబోతోందన్నారు. వరికి మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఎవరూ వినిపించుకోవడం లేదు

నాకున్న 4 ఎకరాల వారసత్వ భూమిలో 50 సెంట్లను పక్కన లేఅవుట్‌ వేసేవారు ఆక్రమించుకుని చదును చేసుకున్నారు. గతంలో మా మండలం తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడు కలెక్టర్‌కు మూడుసార్లు అర్జీలిచ్చాను. పట్టించుకోలేదు. ఇక్కడ రెండుసార్లు ఇచ్చాను. ఎవరూ నా గోడు వినిపించుకోవడం లేదు.

– చెన్నూరు రాజగోపాల్‌రెడ్డి, చిల్లకూరు మండలం

అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..1
1/3

అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..

అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..2
2/3

అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..

అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..3
3/3

అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement