రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌

Feb 10 2026 7:21 AM | Updated on Feb 10 2026 7:21 AM

రౌడీష

రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌

నెల్లూరు(క్రైమ్‌): తీరుమారని రౌడీషీటర్‌పై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. నెల్లూరు చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావు వివరాల మేరకు.. కోటమిట్టకు చెందిన షేక్‌ మసూద్‌ అలియాస్‌ మక్సూద్‌ అలియాస్‌ పెద్ద మసూద్‌పై చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీ ట్‌ ఉంది. అతనిపై హత్య కేసుతోపాటు పలు కేసులున్నాయి. కలెక్టర్‌ అనుమతితో పోలీసులు సోమవారం మసూద్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

పిల్లల్ని చూసేందుకు వెళ్తూ..

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కోట: మండలంలోని రాఘవాపురం వద్ద కోట – గూడూరు ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.సుబ్బమ్మ (42) అనే మహిళ మృతిచెందింది. ఎస్సై పవన్‌కుమార్‌ కథనం మేరకు.. వాకాడు మండలం శ్రీపురానికి చెందిన సుబ్బమ్మ తన మరిది రవి మోటార్‌బైక్‌పై నెల్లూరుకు వెళ్తోంది. రామాపురానికి చెందిన రాజశేఖర్‌ బైక్‌పై ముందు వెళ్తూ ఒక్కసారిగా రాఘవాపురం వైపు తిప్పాడు. వెనుక వస్తున్న బైక్‌ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన సుబ్బమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. రవికి గాయాలయ్యాయి. మృతురాలికి భర్త, పిల్లలున్నారు. నెల్లూరులో చదువుతున్న పిల్లల వద్దకు వెళ్తూ ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించారు. కోట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు.

ప్రజల్ని ఇబ్బందులకు

గురిచేస్తే చర్యలు

ఏఎస్పీ దీక్ష

నెల్లూరు(క్రైమ్‌): ‘ప్రజలతో మమేకమై శాంతియుతంగా జీవించాలి. వారిని ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు’ అని నగర ఏఎస్పీ దీక్ష ట్రాన్స్‌జెండర్లను హెచ్చరించారు. నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం ట్రాన్స్‌జెండర్స్‌తో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరితోనూ దౌర్జన్యంగా, దురుసుగా ప్రవర్తించరాదన్నారు. నేరాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖకు పూర్తిగా సహకరిస్తూ చట్టపరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో నగర ఇన్‌స్పెక్టర్‌లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్‌రెడ్డి, వైవీ సోమయ్య, కె.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

పిట్‌ ఎన్‌డీపీఎస్‌

యాక్ట్‌ ప్రయోగం

నెల్లూరు(క్రైమ్‌): గంజాయి అక్రమ రవాణా కేసులో నెల్లూరు వేదాయపాళేనికి చెందిన రౌడీషీటర్‌ జగదీష్‌పై పిట్‌ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులోని వివరాల మేరకు.. గతేడాది ఆగస్ట్‌ 24వ తేదీన జగదీష్‌ మరో ఇద్దరు గంజాయి అక్రమంగా తరలిస్తుండగా నెల్లూరు రూరల్‌ మండలం దొంతాలి వద్ద వేదాయపాళెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 19.470 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌ ఐదో తేదీన కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న పలువురిని దొంతాలి అడ్డరోడ్డు జంక్షన్‌ వద్ద వేదాయపాళెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 23.470 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. విచారణలో జగదీష్‌ పేరు వెల్లడవడంతో అతడిపై కేసు నమోదు చేశారు. జిల్లా పోలీసు అఽధికారుల నివేదిక ఆధారంగా పిట్‌ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌1
1/1

రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement