నిందితులను కఠినంగా శిక్షించాలి
ఆత్మకూరు: గుమ్మళ్లదిబ్బలో గంజాయి మత్తులో మైనర్ బాలికపై దారుణానికి పాల్పడి, మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆత్మకూరు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సత్రం సెంటర్ నుంచి మున్సిపల్ బస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయుకులు మాట్లాడుతూ గుమ్మళ్లదిబ్బలో మైనార్టీ వర్గానికి చెందిన మైనర్ బాలికను గంజాయి సేవించిన ఇద్దరు యువకులు (మైనర్లు) హింసించి ఆమె చావుకు కారణమవడం రాష్ట్రంలో గంజాయి ఏరులై పారుతుందనడానికి నిదర్శనమన్నారు. గంజాయి అరాచకాలకు పోయే ప్రాణాలు తెచ్చివ్వలేమని, ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి గంజాయి విక్రయాలను సంపూర్ణంగా అడ్డుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.


