పన్నులను నూరు శాతం వసూలు చేయాలి
కోవూరు: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 15 నాటికి పన్నులను నూరు శాతం వసూలు చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లక్ష్యాన్ని సాధించలేకపోతే సహించేదిలేదని స్పష్టం చేశారు. పంచాయతీలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఇవి ఎంతో కీలకమని వివరించారు. కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 81,777 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 30,209 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.7 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
పన్నులను నూరు శాతం వసూలు చేయాలి


