సముద్రంలో మునిగిన బోటు
కోట: చైన్నె సమీపంలో చేపల వేటకెళ్లిన బోటు సముద్రంలో బోల్తాపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గోవిందపల్లిపాళేనికి చెందిన ఐదుగురు, విడవలూరు మండలం ఊటుకూరుపాళేనికి చెందిన ముగ్గురు, పొన్నపూడికి చెందిన నలుగురు ఇలా 12 మంది చైన్నెకు చెందిన బోటులో చేపల వేట నిమిత్తం మూడు రోజుల క్రితం వెళ్లారు. ఈ తరుణంలో చైన్నెకు ఐదు కిలోమీటర్ల దూరంలో బోటు సముద్రంలో శనివారం ఉదయం బోల్తాపడింది. మరో బోటు ద్వారా వీరిని వెంటనే సురక్షితంగా తరలించారు.
కనులపండువగా
సముద్రస్నానం
కావలి: దుత్తలూరు మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ తల్లి సముద్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా ఆదివారం నిర్వహించారు. అమ్మవారిని పుష్పాలతో సుందరంగా అలంకరించి.. మేళతాళాలు, బాణసంచా నడుమ నడుమ గ్రామోత్సవాన్ని జరిపారు. వింజమూరు, కలిగిరి, జలదంకి మీదుగా కావలికి శనివారం చేరుకుంది. అనంతరం కావలి మండలంలోని సత్రం వద్ద సముద్రస్నానాన్ని చేయించి పూజలు నిర్వహించారు. దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు పూలు, పండ్లు, టెంకాయలను సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
సముద్రంలో మునిగిన బోటు


