కొండదిబ్బలో కార్డన్ సెర్చ్
● 35 ద్విచక్ర వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూలాపేట కొండదిబ్బ ప్రాంతంలో ఆదివారం కార్డన్ సెర్చ్ జరిగింది. నగర ఏఎస్పీ దీక్ష పర్యవేక్షణలో చిన్నజారు, సంతపేట ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, వైవీ సోమయ్య సిబ్బందితో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది వరకు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారి పూర్తి వివరాలను సేకరించారు. పత్రాలు సక్రమంగా లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావు స్థానిక ప్రజలతో మాట్లాడారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు విడిచి ఊర్లకు వెళ్లేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్డన్ సెర్చ్‌లో ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొండదిబ్బలో కార్డన్ సెర్చ్


