స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఉదయగిరి రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని సున్నంవారిచింతల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన మద్దిశెట్టి సుందర్ (55) భజన నేర్పిస్తుంటాడు. పని నిమిత్తం ఉదయగిరికి బైక్‌పై వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. అలాగే వరికుంటపాడు మండలం యర్రంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మనోహర్, గురుబ్రహ్మం బైక్‌పై ఉదయగిరి వైపు వెళ్తున్నారు. సున్నంవారిచింతలకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో సుందర్‌కు తీవ్రంగా, ఆ ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలానికి ఎస్సై ఇంద్రసేనారెడ్డి చేరుకుని వివరాలు సేకరించారు.
‘యువత గంజాయికి బానిసవుతున్నారు’
● వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్
కోవూరు: యువత గంజాయికి బానిసలుగా మారి ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆదివారం ఆయన గుమ్మళ్లదిబ్బలో బాలిక మృతదేహానికి నివాళులర్పించి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. పునరావృతం కాకుండా పెట్రోలింగ్ పెంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ ఘటనతో మాకు కూడా రక్తం మరుగుతోందన్నారు.
పొదలకూరు
నిమ్మధరలు (కిలో)
పెద్దవి : రూ.50
సన్నవి : రూ.30
పండ్లు : రూ.20
స్వగ్రామానికి వెళ్తుండగా..
స్వగ్రామానికి వెళ్తుండగా..


