పెన్నానదిలో యువకుడి గల్లంతు
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని జొన్నవాడకు సమీపంలోని పెన్నానదిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు సర్వేపల్లి కాలువకట్ట వద్ద సుబ్రహ్మణ్యం కుటుంబం నివాసం ఉంటోంది. అతడి కుమారుడు సంతోష్ కుమార్ బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు జొన్నవాడ సమీపంలోని పెన్నానది వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు సంతోష్ నదిలో గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి గాలించినా ఫలితం లేకుండా పోయింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ఆచూకీ కోసం గాలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
నేడు
‘డయల్ యువర్ ఎస్‌ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమం జరుగుతుందని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎండీ శివశంకర్ ఆదేశాలతో నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను చెప్పొచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పెన్నానదిలో యువకుడి గల్లంతు


