పక్కాగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ

Feb 8 2026 11:15 AM | Updated on Feb 8 2026 11:15 AM

పక్కా

పక్కాగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ

నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేశామని డీఆర్వో విజయకుమార్‌ తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సమన్వయాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ శాఖ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, దేవదాయ శాఖ ఈఈ గ్రేడ్‌ – 3 నియామకాలకు సంబంధించిన పరీక్షలను నెల్లూరు రూరల్‌, అర్బన్‌, కావలి, బుచ్చిరెడ్డిపాళెంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించనున్నామని వివరించారు. హాల్‌ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకురావాలని కోరారు. కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లను నిషేధించామని వెల్లడించారు.

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

అల్లూరు: స్థానిక ఆర్డీఆర్‌ కాలనీలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్‌ సరిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులంలో బాలికలకు 40 సీట్లు కేటాయించారని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి నాలుగులోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

శ్రీవారి దర్శనానికి

12 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 23 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 67,085 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,832 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

అలరించిన

ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ ఎక్స్‌పో

సంగం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మండలంలోని మర్రిపాడు జెడ్పీ హైస్కూల్లో ఆర్ట్స్‌ – క్రాఫ్ట్స్‌ ఎక్స్‌పోను ప్రధానోపాధ్యాయుడు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ సుధీర్‌ హాజరయ్యారు. వివిధ నమూనాలను పరిశీలించిన అనంతరం విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.

క్రమబద్ధీకరణలో

వేగం పెంచండి

ఆత్మకూరు: అనధికార లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మధుకుమార్‌ కోరారు. పట్టణంలోని పలు లే అవుట్లు, నిర్మాణంలో ఉన్న భవనాలను మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. పట్టణంలో 272 లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌ కోసం అర్జీలు రాగా, వీటిలో 104 పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

పక్కాగా ఏపీపీఎస్సీ  పరీక్షల నిర్వహణ 1
1/3

పక్కాగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ

పక్కాగా ఏపీపీఎస్సీ  పరీక్షల నిర్వహణ 2
2/3

పక్కాగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ

పక్కాగా ఏపీపీఎస్సీ  పరీక్షల నిర్వహణ 3
3/3

పక్కాగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement