గంజాయి అరాచకాలతో బాలిక మృతి బాధాకరం
పొదలకూరు: కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో గంజాయి అరాచకాలకు బాలిక మరణించడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పారు. ఘటన జరిగిన అనంతరం బాలికకు ప్రేమ వ్యవహారం ఉందని నిందలేయడం తగదన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, గంజాయి విక్రేతలు, నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించడంతో పాటు బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


