డిగ్రీ పరీక్షలకు 76 మంది గైర్హాజరు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షలకు 76 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి తెలిపారు. మొత్తం 976 మంది విద్యార్థలకు గాను 900 మంది హాజరయ్యారని తెలియజేశారు.
పాముకాటుకు గురై..
● చికిత్స పొందుతూ మృతి
నెల్లూరు(క్రైమ్): పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని మన్సూర్‌నగర్‌లో మల్లేష్(45), పాంచాలి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి నలుగురు పిల్లలున్నారు. గత నెల 30వ తేదీ రాత్రి మల్లేష్ ఇంట్లో ఉండగా స్నేహితుడు కొండయ్య వచ్చి వాకర్స్‌రోడ్డు పరమేశ్వరి నగర్ ప్రధాన రహదారిపై పాము ఉందని, చంపాలంటూ అతన్ని తీసుకెళ్లాడు. అక్కడ మల్లేష్ పాముకాటుకు గురయ్యాడు. 31వ తేదీ ఉదయం మల్లేష్‌కు వాంతులు, రెండు చేతులు వాచి ఉండటం, శరీరంపై మచ్చలు ఏర్పడ్డాయి. గమనించిన పాంచాలి భర్తను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
కావలి: పట్టణ పరిధిలోని ము సునూరు మందాటిచెరువులో పడి గుర్తుతెలి యని వ్యక్తి మృతిచెందిన ఘట న శనివారం వెలుగు చూసింది. కావలి రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి సమాచారం మేరకు.. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మందాటి చెరువులో శనివారం ఉదయం 6 గంటల సమయంలో మృతిచెందినట్లు కావలి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందింది. మృతుడు దుస్తులు ఉతుక్కుని వాటిని గట్టుమీద ఆరబెట్టారని, మళ్లీ స్నానం చేసేందుకు చెరువులో దిగి మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించామని, మృతుని ఆచూకి తెలిసిన వారు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలన్నారు.
రాపూరులో వృద్ధుడు
రాపూరు: రాపూరు లోని దాబల చెరువులో పడి శనివారం వ్యక్తి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయడంతో రాపూరు కొత్తపేటకు చెందిన కొల్లు బాబు(65)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందారా, ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది.
రైలు కింద పడి..
● మహిళ మృత్యువాత
మనుబోలు: రైలు కింద పడి మహిళ మృతి చెందిన ఘటన మనుబోలు రైల్వేస్టేషన్ వద్ద శనివారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. మనుబోలు రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు ప్లాట్‌ఫారమ్ చివరన డౌన్‌లైన్‌లో ఓ గుర్తు తెలియని మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా సంత్రాగచి ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో మృతిచెందింది. మృతురాలి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఐదడుగుల ఎత్తు ఉన్న మహిళ పసుపు రంగపై నలుపు రంగు డిజైన్ గల సిల్క్ చీర ధరించి ఉంది. మృతురాలిని గుర్తించేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
ఆయుష్ డెంటల్ కేర్‌లో
వైద్యశిబిరం నేడు
నెల్లూరు(అర్బన్): నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న ఆయుష్ డెంటల్ కేర్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని ఆ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఉమ్రాన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన శనివారం ఆస్పత్రిలో వెల్లడించారు. తమ ఆస్పత్రి 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డెంటల్ ఇంప్లాంట్స్, రూట్ కెనాల్, క్రౌన్స్, బ్రిడ్జెస్, క్లీనింగ్ తదితర అన్నిరకాల దంత చికిత్సలపై 50 రాయితీ ఇస్తున్నామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన 50 మందికి పూర్తి ఉచిత డెంచర్ సెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలకు 90521 54399 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
డిగ్రీ పరీక్షలకు 76 మంది గైర్హాజరు
డిగ్రీ పరీక్షలకు 76 మంది గైర్హాజరు


