ఐదు కేజీల గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): అక్రమంగా గంజాయిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులను నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో రైల్వే సీఐ ఎ.సుధాకర్‌తో కలిసి శనివారం వివరాలను వెల్లడించారు. ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా శుక్రవారం రాత్రి నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫారమ్‌పై అనుమానాస్పదంగా ఉన్న తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లా ఇచ్చిపట్టి ప్రాంతానికి చెందిన కార్తీక్, మాదవ్‌లను అదుపులోకి తీసుకుని వారి బ్యాగ్‌లను తనిఖీ చేశారు. ఐదు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితులను స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు. నిందితులు ఒడిస్సా, ఏఓబీ సరిహద్దు ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి తమ స్వరాష్ట్రానికి విక్రయించేందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించడంతో వారిని అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. తనిఖీల్లో పాల్గొన్న రైల్వే సీఐ, కావలి, నెల్లూరు ఎస్సైలు వెంకటరావు, హరిచందన, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


