సాంకేతికతతోనే మంచి భవిత
వెంకటాచలం: సాంకేతికతతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వీఎస్‌యూలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో ఏఐపై రెండు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి వర్క్‌షాప్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రస్తుతం మానవ వనరుల రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నారు. ముఖ్యంగా నియామక ప్రక్రియలు, శిక్షణా విధానాలు, పనితీరు మూల్యాంకనంలో కృత్రిమ మేధస్సు వినియోగం వల్ల పారదర్శకత, వేగం పెరుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు, అధ్యాపకులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఆర్ కన్సల్టెంట్, ది హమ్మింగ్ బర్డ్ కోచింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు అబ్దుల్ రజాక్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించి, పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయానంద్ కుమార్ బాబు, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి స్రవంతి, డాక్టర్ జె.విజేత, ఎ.గాయత్రి తదితరులు పాల్గొన్నారు.


