ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం
ఇందుకూరుపేట: విద్యుత్ లైన్ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని జగదేవిపేటలో శనివారం చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. మైపాడు– నెల్లూరు రోడ్డు విస్తరణలో భాగంగా పాత విద్యుత్ లైన్లను తొలగించి కొత్త లైన్లు ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన ప్రళయకావేరి జాలయ్య(44)తో పాటు మరికొందరు మండలంలోని జగదేవిపేటలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు వచ్చారు. కొత్త స్తంభాలను ట్రాక్టర్ సాయంతో ఏర్పాటు చేసే క్రమంలో పాత లైన్‌కు తగలడంతో జాలయ్య, ఆవుల శీను, వెంకటరమణయ్యలకు కరెంట్ షాక్ తగిలింది. శీను, వెంకటరమణయ్య స్వల్పగాయాల పాలవగా, జాల య్య తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమి త్తం ఆయన్ను ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్య శాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్ప టికే మృతిచెందినట్లు చెప్పారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమా దం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత లైన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి పనులు చేయాల్సి ఉండగా, ఇందుకు భిన్నంగా కరెంటు నిలిపివేయకుండా పనులు చేయడంతోనే ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.


