అధికారం ఉంది.. మా ఇష్టం
అనుమసముద్రంపేట: టీడీపీ ప్రభుత్వ తీరుపై ఏఎస్‌పేట మండలం శ్రీకొలను గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 35 ఎకరాల మేత పోరంబోకు భూమిని సోలార్ ప్లాంట్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం శ్రీకొలను గ్రామంలోని సర్వే నంబర్ 411లో ప్లాంట్‌కు 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీంతో శ్రీకొలను, హసనాపురం, జువ్వలగుంటపల్లి గ్రామానికి చెందిన రైతులు మండిపడున్నారు. జేసీబీతో చేయిస్తున్న పనులను సైతం నిలుపుదల చేయించారు. మూడు గ్రామాల్లో 1,500 గేదెలు, 10 వేల గొర్రెలు, 5 వేల మేకలున్నాయి. వర్షాకాలంలో చెరువుకు వెళ్లేందుకు దారి ఉండదు. ఈ క్రమంలో గ్రామాల్లో ఎక్కువ శాతం ఈ జీవాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దాదాపు 362 ఎకరాల మేత పోరంబోకు భూముల్లో పశువులు, మేకలు, గొర్రెలను మేపుతుంటారు.
సంబంధం లేకుండానే..
ఇటీవల కూటమి నేతలు ఈ భూములపై కన్నేశారు. గతంలో వాటి జోలికి పోవ్వొద్దని రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టారు. అయితే కొద్దిరోజుల క్రితం అకస్మాత్తుగా ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కల భూమిగా రికార్డులో ఉన్నట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వందేళ్ల నుంచి 411 సర్వే నంబర్‌లోని మేత పోరంబోకు భూమిలో ఆక్రమణలకు గురికాకుండా రైతులు కాపాడుకుంటూ వచ్చారు. కానీ సోలార్ ప్లాంట్ పేరుతో 32 ఎకరాల భూమిని ఇప్పటికే అప్పగించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామనత్తం కలిగిన భూములను పంచాయతీలు తీర్మానం చేయాలి. ఇందుకోసం ముందుగా గ్రామసభలను నిర్వహించి సర్పంచ్ చేత తీర్మానం చేయించాల్సి ఉంటుంది. సర్పంచ్ దళిత మహిళ కావడంతో అగ్రవర్ణాలకు చెందిన ఓ టీడీపీ నేత పంచాయతీకి సంబంధం లేకుండానే తహసీల్దార్ చేత నివేదికలు కలెక్టర్ కార్యాలయానికి పంపారు. ఈ తంతుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోలార్ ప్లాంట్‌కు మేతపోరంబోకు భూముల కేటాయింపు
ఉద్యమం చేస్తామంటున్న
గ్రామస్తులు
32 ఎకరాలు మాత్రమే ఇచ్చాం
శ్రీకొలను గ్రామంలోని సర్వే నంబర్ 411లో ఉన్న భూములు ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కల భూమిగా రికార్దైంది. ఇందులో కేవలం 32 ఎకరాలు మాత్రమే సోలార్ ప్లాంట్‌కు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. రైతులతో చర్చిస్తాం.
– అనిల్ కుమార్,
తహసీల్దార్, ఏఎస్‌పేట


