శుభమస్తు షాపింగ్‌మాల్లో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): నెల్లూరులోని శుభమస్తు షాపింగ్‌మాల్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహిస్తున్న ‘క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్’ ఎలక్ట్రిక్ స్కూటీ 7వ లక్కీ డ్రా ఆదివారం జరిగింది. దీనిని ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ శ్రీధర్ తీశారు. విజేతగా డానియల్ మోహన్ (అద్దంకి) నిలిచారు. శ్రీధర్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలోనే కాకుండా సామాజిక దృక్పథంలో నిర్వహిస్తున్న హృద్రోగుల కోసం లోడింగ్ డోస్ కిట్, మజ్జిగ చలివేంద్రం, నిరాశ్రయులకు అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని శ్రీధర్ తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా భలే పండగలు.. భలే బహుమతులు కార్యక్రమంలో భాగంగా జనవరి 17 వరకు 39 స్కూటర్ల ఎలక్ట్రిక్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే రెండు పెద్ద పండగలకు రెండు పెద్ద కార్లు డ్రాను డిసెంబర్ 29న, జనవరి 19న నిర్వహించనున్నట్లు తెలిపారు.


