బ్యాగుల పంపిణీ
విద్యార్థులకు ఎంతో కీలకమైనవి బ్యాగులు. చిట్టి భుజాలతో పాఠ్యపుస్తకాలను ఇందులో ఉంచుకొని పాఠశాలకు ఠీవిగా వస్తారు. నాణ్యతతో కూడిన వీటిని అందించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించి నాసిరకమైనవి అంటగట్టింది. వీటిని ఇచ్చిన రెండు నెలలకే చినిగిపోతున్నాయంటే ఇవి ఎంత క్వాలిటీవో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సర్కారీ పాఠశాలల్లో చదివే వారు సామాన్యులనే అంశాన్ని విస్మరించి అందిన కాడికి దోచుకోవడమే పరమావధిగా వ్యవహరిస్తున్న టీడీపీ తీరుపై తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు.
మా ఇద్దరు పిల్లలు జెడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇచ్చిన బ్యాగులు రెండు నెలలకే పూర్తిగా చినిగిపోయాయి. మొద ట్లోనే జిప్‌లు పాడైపోతే కొత్తవి వేయించాం. అయి నా బ్యాగ్ పైభాగం దెబ్బతింటోంది. పుస్తకాల బరువుకు హ్యాండిళ్లు ఆగడం లేదు. తరచూ తెగిపోతున్నాయి. మళ్లీ మళ్లీ కుట్టించాల్సి వస్తోంది.
– జీవన్‌కుమార్, పోస్టల్ కాలనీ
నెల్లూరు(టౌన్): తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని గత ఎన్నికలకు ముందు ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. తీరా కొలువుదీరాక కార్పొరేట్‌కు పెద్దపీటేస్తూ.. సర్కారీ బడులపై అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. నాడు – నేడు మొదలుకొని స్టూడెంట్లకు అందజేసే విద్యా కానుక వరకు ఇదే వైఖరిని అవలంబిస్తున్నారు. విద్యాసంవత్సర ప్రారంభంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ పేరుతో అందజేసిన పలు వస్తువులు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా బ్యాగులు రెండు నెలలకే చినిగిపోయాయి. ఈ పరిణామాల క్రమంలో వీటి నాణ్యతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అత్యంత దుర్భరంగా
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కార్ అందజేసిన బ్యాగులు దుర్భరంగా మారుతున్నాయి. రెండు నెలలకే ఇవి చినిగిపోతున్నాయి. వీటిని కొందరు కుట్టించినా, సమస్య మళ్లీ మొదటికొస్తోంది. ఫలితంగా దెబ్బతిన్న వాటితోనే స్కూళ్లకు రావాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మరికొందరు చేసేదేమీ లేక కొత్త వాటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది.
నాటి బ్యాగులు.. నేటికీ పదిలంగా
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థకు అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీటేశారు. నాడు – నేడుతో వీటి రూపురేఖలను సమూలంగా మార్చి.. స్టూడెంట్స్‌కు నాణ్యతతో కూడిన బ్యాగులను అందజేశారు. ఇవి నేటికీ పదిలంగా ఉండటంతో ఇప్పటికీ పలువురు విద్యార్థులు వీటినే వినియోగిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత సర్కార్ అందించిన బూట్లు, సాక్సులు సైతం నాసిరకంగానే దర్శనమిస్తున్నాయి.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 3221 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో ఫౌండేషన్ – 968.. బేసిక్ ప్రైమరీ – 1187.. మోడల్ ప్రైమరీ – 79, హైస్కూళ్లు – 288, హైస్కూల్ బీపీఎస్ – 74, హైస్కూల్ ఎమ్పీఎస్ – 31. ఇందులో 1,61,959 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో బ్యాగులు, బెల్ట్, నోట్ బుక్స్, షూలు, సాక్సులు, యూనిఫారం, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీ, టెక్స్‌ట్, వర్క్ బుక్స్‌ను అందజేశారు. విద్యా సంవత్సర ప్రారంభ రోజునే ఇవ్వాల్సిన వీటిని దాదాపు రెండు, మూడు నెలల పాటు అందజేశారు.
ధర భారీగా.. నాణ్యత డొల్లగా..!
బ్యాగుల పరిస్థితి దారుణంగా మారింది. ఒక్కోదానికి రూ.600 నుంచి రూ.700 వరకు వెచ్చించామని ప్రభుత్వం చెప్తున్నా, వాటి నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికిచ్చిన జిప్పులు, హ్యాండిళ్లు నెలకే ఊడిపోవడం లేదా తెగిపోతున్నాయి. పైన, కింది భాగాలు చినిగిపోతున్నాయి. వీటిని కుట్టించినా మరో ప్రాంతంలో దెబ్బతింటున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా పుస్తకాలెక్కడ పడిపోతాయోననే ఆందోళనలో విద్యార్థులున్నారు. కొందరు కొత్త వాటిని కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ఉన్న వాటినే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు సైజులతో సంబంధంలేకుండా కొందరికి షూస్‌ను అందజేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నాసిరకంగా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు.
నాసిరకంగా ఉన్నాయి
మా బాబు జెడ్పీ హైస్కూ ల్లో చదువుతున్నాడు. బ్యాగులు నాసిరకంగా ఉండటంతో తరచూ దెబ్బతింటున్నాయి. దీంతో కొత్త దాన్ని కొను గోలు చేయాల్సి వస్తోంది. నాణ్యతతో ఉన్న వాటినిస్తే విద్యాసంవత్సరం పూర్తయ్యేంత వరకు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో ఎక్కువ మంది పేదలు. వీటిని కొనుగోలు చేయడం ఇబ్బందిగా ఉంటుంది. నాణ్యతతో కూడిన బ్యాగులను ఇవ్వాలి.
– సూరి, పద్మావతి సెంటర్
బ్యాగుల పంపిణీ
బ్యాగుల పంపిణీ


