విశాఖకు నిమ్మ ఎగుమతులు
పొదలకూరు: స్థానిక నిమ్మ మార్కెట్ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు నిమ్మ కాయలను కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎగుమతి చేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ ఏడీ అనితాకుమారి మాట్లాడారు. 10 టన్నుల కాయలను రైతుల నుంచి సేకరించి పంపుతున్నామని పేర్కొన్నారు. కిలోకు రూ.15 గిట్టుబాటయ్యేలా చర్య లు చేపడుతున్నామని వెల్లడించారు. తిరుపతి, చిత్తూ రు, కోనసీమ, అన్నమయ్య, కాకినాడ జిల్లాలకు మరో 15 టన్నుల కాయలను శుక్రవారం ఎగుమతి చేయనున్నామని వివరించారు. సొసై టీ చైర్మన్ మస్తాన్‌బాబు, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు అరుణమ్మ, సెక్రటరీ ఇలియాజ్ పాల్గొన్నారు.


