కొన్ని ఘటనలు
● ఆగస్ట్ 13వ తేదీన నెల్లూరు – ముత్తుకూరు రోడ్డు మార్గంలో కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో ని నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు ఏమీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
● 30వ తేదీన నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు వెళ్లే లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. తెల్లవారుజామున కావడంతో వాహనాల రాకపోకల్లేవు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.
● నవంబర్ 22వ తేదీన కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఎక్కింది. అయితే ఆ సమయంలో ఎదురుగా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కొన్ని ఘటనలు


