రవాణా వాహన యజమానుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్య
నెల్లూరు(టౌన్): రవాణా వాహనాలకు బాడుగలు కరువై యజమానులకు దిక్కుతోచడంలేదు. అరకొరగా లభిస్తున్నా, పోటీతత్వంతో పదేళ్ల క్రితం ఉన్న కిరాయితోనే కాలాన్ని సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవి చాలదన్నట్లు డీజిల్, ఇన్సురెన్స్, టైర్లు, వాహన విడిభాగాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటిని మోయలేకే సతమతమవుతున్న ఓనర్లపై ఫిట్‌నెస్ చార్జీల భారం గుదిబండలా మారింది. వాహన కాలపరిమితి 15 ఏళ్లు దాటితే ఒకలా.. 20 ఏళ్లు దాటితే మరో తరహాలో అనే విధంగా చార్జీలను పెంచేశారు. ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతూ, రవాణా అధికారుల కంటపడితే భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిణామాల క్రమంలో కాలం చెల్లిన వాహనాలను మూలనపడేసే పరిస్ధితి నెలకొనే అవకాశముందని యజమానులు పేర్కొంటున్నారు. తమ బాధలను పరిణగనలోకి తీసుకొని ఆదుకోవాలని కోరుతున్నారు.
జిల్లాలో ఐదు లక్షల వాహనాలు
జిల్లాలో వాహనాలు ఐదు లక్షలకుపైగా ఉన్నాయని రవాణా అధికారులు చెప్తున్నారు. వీటిలో ట్రాన్స్‌పోర్టుకు చెందినవి 1.2 లక్షలు కాగా బైకులు, కార్లు 3.10 లక్షలకుపైగా ఉన్నాయి. ఆటోలు 20,174.. గూడ్స్ క్యారియర్లు 14,500.. వ్యవసాయ ట్రాక్టర్లు 12,284.. వాణిజ్య ట్రాక్టర్లు 3900.. లారీలు 12 వేలు.. మిగిలినవి సీసీ, స్కూల్ బస్సులు, లగ్జరీ క్యాబ్‌లు, మొబైల్ క్లినిక్‌లు, మ్యాక్సీ, మోటార్ క్యాబ్‌లు తదితరాలున్నాయి. కాలం చెల్లిన వాహ నాలపై టెస్టింగ్, సర్టిఫికేషన్ ఫీజులతో పాటు జీఎస్టీ చార్జీలనూ మోపారు.
వాహనాలు – ఐదు లక్షలకుపైగా..
ట్రాన్స్‌పోర్టు వాహనాలు – 1.2 లక్షలు
కాలం చెల్లిన వాహనాలపై అధిక భారం
గతంతో పోలిస్తే రెండు నుంచి
మూడు రెట్ల మోత
పెంపు నిర్ణయంపై ప్రభుత్వాల బంతాట
ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ను తిప్పలేమంటున్న యజమానులు
డీజిల్, టైర్లు, ఇన్సురెన్స్, విడిభాగాల ధరలు ౖపైపెకి
సమ్మెకు సన్నద్ధమవుతున్న ఓనర్లు
పెరిగిందిలా..
జిల్లాలో ఇలా..
చార్జీలను తగ్గించాలి
రవాణా వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్ చార్జీలను భారీగా పెంచారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలవగా, పెంపు తమ పరిధిలో లేదని చెప్తున్నారు. ప్రస్తుతం రవాణా వాహనాలను తిప్పే పరిస్థితి లేదు. బాడుగలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కొత్త వెహికల్స్‌ను కొనుగోలు చేసే అవకాశమూ లేదు. మా బాధలను అర్థం చేసుకోవాలి.
– నారాయణ, జిల్లా సెక్రటరీ, లారీ యజమానుల సంఘం
రవాణా వాహన యజమానుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్య


