కరకట్టల పటిష్టతకు ప్రతిపాదనలు
సంగం: జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంతాల్లో కరకట్టల పటిష్టత, నిర్మాణం కోసం రూ.530 కోట్లతో ప్రతిపాదనలను పంపామని ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ్‌నాయక్ తెలిపారు. సంగం బ్యారేజీ సమీపంలోని పొర్లుకట్టలను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సెంట్రల్ డివిజన్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు రూ.50 కోట్ల ఎఫ్డీఆర్ నిధులు మంజూరయ్యాయని, పనులను త్వరలో చేపట్టనున్నామని వెల్లడించారు. లష్కర్లకు జీతాలు ఆగి ఉన్నాయనే విషయం తెలిసిందన్నారు. వరదలతో పొర్లుకట్టతో పాటు ఇసుక దిబ్బ కోతకు గురవుతోందని రైతులు తెలియజేశారని, దీని పటిష్టానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. తహసీల్దార్ సోమ్లానాయక్, డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు.


