స్పిల్‌వే నుంచి నీటి విడుదల నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

స్పిల్‌వే నుంచి నీటి విడుదల నిలిపివేత

Dec 8 2025 7:37 AM | Updated on Dec 8 2025 7:37 AM

స్పిల

స్పిల్‌వే నుంచి నీటి విడుదల నిలిపివేత

పొదలకూరు: కండలేరు స్పిల్‌వే నుంచి నీటి విడుదలను తెలుగు గంగ అధికారులు ఆదివారం నుంచి నిలిపివేశారు. కండలేరు జలాశయంలో ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు ఉన్నాయని, పైతట్టు నుంచి ఊహించని విధంగా నీరు వస్తున్నట్టు ఆందోళన చెందిన అధికారులు స్పిల్‌వే నుంచి 500 క్యూసెక్కుల నీటిని స్వల్పంగా విడుదల చేశారు. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేస్తే ఏటికాలువలో కలిసి మనుబోలు మండలంలోని కొన్ని గ్రామాల మీదుగా సముద్రం వెళ్లాల్సి ఉంటుంది. అయితే మనుబోలు మండలంలోని గ్రామాలకు ఇబ్బందులు కలుగుతాయని, జలాశయానికి పైతట్టు నుంచి నీరు రావడం తగ్గిపోవడంతో స్పిల్‌వే నుంచి నీటిని నిలిపివేసినట్టు అధికారులు అంటున్నారు.

పెన్నానదిలో మృతదేహం

ఇందుకూరుపేట: మండలంలోని ముదివర్తిపాళెం వద్ద పెన్నానదిలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామానికి చెందిన గుత్తి మల్లికార్జునరావు (52) మృతదేహం నదిలో కొట్టుకురాగా స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నాగార్జునరెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి జేబులో లభ్యమైన ఆధార్‌కార్డు ఆధారంగా వివరాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారులు చెప్పారు.

117 మద్యం బాటిళ్ల

స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): పోలీసులు దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 117 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని కామాటివీఽధికి చెందిన సీహెచ్‌ మల్లికార్జున అదే ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకుని చైతన్య ఎలక్ట్రానిక్‌ ధర్మ కాటా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతను కావలి ముసునూరులో ఉంటూ రోజు దుకాణానికి వచ్చి వెళ్తున్నాడు. ఆదివారం దుకాణంలో మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ ఉంచారని సంతపేట పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ వైవీ సోమయ్య నేతృత్వంలో ఎప్సై బాలకృష్ణ దాడి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన 117 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం ఎక్కడ? ఎప్పుడు? ఎవరి వద్ద కొనుగోలు చేశారు తదితర వివరాలపై ఎకై ్సజ్‌ అధికారుల సాయంతో ఆరా తీస్తున్నారు.

కసుమూరులో కార్డన్‌ సెర్చ్‌

46 వాహనాల స్వాధీనం

వెంకటాచలం: నేర నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీస్‌ అధికారులు కసుమూరులోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం కార్డన్‌ సెర్చ్‌ చేశారు. వాహనపత్రాల్లేని 46 వాహనాలను స్వాధీనం చేసుకున్నా రు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ జి.శ్రీనివాసరావు నేతృత్వంలో వెంకటాచలం ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి కసుమూరులోని తిప్ప, బీసీ కాలనీ, పెద్దూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇళ్లలోని వారి వివరాలను సేకరించారు. వాహనపత్రాల్లేని 39 ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు, రెండు జంటలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న డయల్‌ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

స్పిల్‌వే నుంచి  నీటి విడుదల నిలిపివేత
1
1/1

స్పిల్‌వే నుంచి నీటి విడుదల నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement