వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
సంగం: మండలంలోని తరుణవాయి వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదే విధంగా సంగం నాలుగు రోడ్ల సెంటర్‌లో నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడు కళ్లు తిరిగి పడి తలకు తీవ్ర గాయమైన ఘటన ఆదివారం జరిగాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని జెండా దిబ్బ గ్రామానికి చెందిన షామీర్ అనే యువకుడు తన ఎఫ్ జెడ్ బైక్‌పై గ్రామం నుంచి సంగానికి బయలుదేరాడు. తరుణవాయి వద్ద నెల్లూరు వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో షామీర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంగం 108 అంబులెన్స్‌లో బుచ్చిరెడ్డిపాళెం తరలించారు. వైద్యుల సూచనల మేరకు షామీర్‌ను నెల్లూరుకు తీసుకెళ్లారు.
● సంగం నాలుగు రోడ్ల సెంటర్ వద్ద చేజర్ల మండలం పెళ్లేరుకు చెందిన సహదేవుడు అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడు. అతను ఆలయాల్లో గీతాపారాయణం చేస్తుంటాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానికులు సంగం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ స్టాఫ్ నర్సు వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సంగం 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. తలకు తీవ్ర గాయం కావడంతో వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు


