జూడో జిల్లా క్రీడాకారుల ఎంపిక
ఉలవపాడు: ఉమ్మడి నెల్లూరు జిల్లా జూడో క్రీడాకారుల ఎంపిక ఆదివారం కరేడు గ్రామంలో జరిగింది. జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోటీలు జరిపారు. మొత్తం 25 మంది పాల్గొనగా 14 మంది ఎంపిక చేసినట్లు కార్యదర్శి మురళి తెలిపారు. పి.కావ్య (కావలి), పి.పవిత్ర, సాగర్, బాలాజీ (కొత్తసత్రం), ఎ.సాయిఅక్షిత (వలేటివారిపాళెం), హైమ (లింగసముద్రం), లోకేశ్, ఉదయ్ సందేశ్ (కరేడు), శ్రీను, సందీప్, జె.హర్షిణి (కలిగిరి), ఎం.అల్లూరయ్య, శివప్రసన్నకుమార్ (రంగాపురం), పి.జీవిత (కందుకూరు) ఎంపికయ్యారు. వీరు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి నెల్లూరు తరఫున పాల్గొంటారని తెలియజేశారు.


